బలమైన ఆశయం, స్థిరమైన ఆలోచన, మంచి చేయాలన్న ఆరాటం.. వీటి కలయికతో స్వయంగా తనను తాను మలచుకున్న నాయకత్వం మన పార్టీ సొంతం! వారసత్వం కాదు.. వెన్నుపోటు చరిత్ర లేదు.. సొంత వారిని చంపిన నేపథ్యం లేదు.. సామాన్యుడి చేతిలో అధికారం ఉండాలి.. యువకుల చేతిలో నిర్ణయాధికారం రావాలి.. ప్రజలను పాలకులుగా చూడాలన్న ధృడమైన సంకల్ప బలమే మన పార్టీ వ్యవస్థాపకులు శ్రీ బోడె రామచంద్ర యాదవ్ గారి బలగం!
సాధారణ రైతు కుటుంబంలో జన్మించి, సర్కారీ బడిలో చదువుకుని, అంచెలంచెలుగా ఎదిగి.. రెండు దశాబ్దాల పాటూ దేశ, విదేశాల్లో వ్యాపారాలను విస్తరించి,
ఆపై తన ఆశయాలు కోసం అన్నిటినీ వదిలేసి "ప్రజా రాజకీయమే అజెండాగా, సామాన్యుడిగా జెండాగా వస్తున్నారు శ్రీ రామచంద్ర యాదవ్".. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో సాధారణ రైతు కుటుంబంలో పుట్టి, పెరిగారు.
చిన్నతనం నుండి తండ్రితో పాటూ పొలంబాట పట్టారు.. సేద్యం చేసారు, స్వేదం చిందించారు.. ఖాళీ సమయాల్లో పొలానికి వెళ్తూ, తన సొంత ప్రాంతం నుండి ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత..
డిగ్రీ, పీజీలు మాత్రం తిరుపతి, చెన్నై నుండి పూర్తి చేసారు. అప్పుడే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ.. ఆరోగ్య, ఫార్మా సహా ఇతర రంగాల్లో స్థిరమైన వ్యాపారవేత్తగా రాణించారు.
"వ్యాపారవేత్తగా విజయవంతమవ్వడంతో ప్రజాసేవ, రాజాకీయ బాటపట్టారు.
అలా 2019 ఎన్నికల్లో తొలిసారిగా పుంగనూరు నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 16,452 ఓట్లు సాధించారు.
పార్టీతో విధానపరంగా వ్యతిరేకించి గత మూడున్నరేళ్లుగా సొంతంగా రాజకీయ వేదిక నిర్మాణంలో తెరవెనుక పనులు ప్రారంభించారు.
మరోవైపు పుంగనూరు నియోజకవర్గానికి ఏదైనా చేయాలన్న తపన మధ్య కొన్ని సేవా కార్యక్రమాలు చేపట్టారు.
కానీ అధికార మదంతో కొట్టుకుంటున్న ఈ వైసీపీ.. దోపిడీ, దౌర్జన్యాల్లో పీహెచ్ డీ చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని రాజకీయంగా ఢీకొట్టి కేసులను ఎదుర్కొన్నారు..
ఈ క్రమంలోనే వైసీపీ గుండాలు అర్ధరాత్రి వేళ, తప్పతాగి వచ్చి ఆయన ఇంటిపై దాడి చేశారు.
కానీ ప్రజా అండతో.. మొక్కవోని పట్టుదలతో ఈ దుర్మార్గపు ప్రభుత్వంపై పోరాటం చేస్తూ.. అనేక అవినీతి వ్యవహారాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తున్నారు!
కేవలం "ప్రజా భాగస్వామ్య పాలన ఉండాలి.. సామాన్యుడి చేతిలో అధికారం ఉండాలి..
ఈ రెండు కులాహంకార దోపిడీ పార్టీలు నేలకూలాలి" అనే సిద్ధాంతంతో బలమైన ప్రజా రాజకీయ వ్యవస్థ నిర్మాణానికి పూనుకున్నారు.