భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ బోడె రామచంద్రయాదవ్ గారి నాయకత్వంపై సంపూర్ణ విశ్వాసం ప్రకటిస్తూ...
శతాబ్దాలుగా అణచివేతకు, అవమానాలకు గురవుతున్న నా బడుగు, బలహీన వర్గాల సంపూర్ణ రాజ్యాధికార సాధనే నా జీవిత అంతిమ లక్ష్యమని...
భారతచైతన్య యువజన పార్టీ సిద్ధాంతాలను నా శ్వాసగా భావించి, పార్టీ నియమ నిబంధనలకు శిరసావహిస్తానని...
నాకు అప్పగించిన ఈ పవిత్ర బాధ్యతను, ఏ దశలోనూ కుల, మత, ధన, లింగ, ప్రాంత వివక్షకు తావివ్వకుండా, నా సొంత ప్రయోజనాలను ఆశించకుండా, పూర్తి నిజాయితీతో, నిస్వార్థ సేవతో నిర్వర్తిస్తానని...
ప్రజాధనాన్ని దోచుకునే అవినీతి రాజకీయాలకు వ్యతిరేకంగా, ప్రజా వ్యతిరేక విధానాలపై రాజీలేని పోరాటం చేస్తానని...
పార్టీ ఐక్యతకు, గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించే ఏ దుష్టశక్తినైనా ఎదుర్కొంటానని, పార్టీ రహస్యాలను నా ప్రాణం కంటే మిన్నగా కాపాడుతానని...
మహాత్మా జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వంటి మహనీయుల ఆశయ సాధన కోసం నా సర్వశక్తులను ఒడ్డి పనిచేస్తానని...
భారత రాజ్యాంగం మీద అచంచలమైన విశ్వాసంతో, మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
Expressing complete faith in the leadership of Sri Bode Ramachandra Yadav, the National President of the Bharat Chaitanya Yuva Party...
I declare that achieving complete political empowerment for my downtrodden and weaker sections of society, who have been subjected to oppression and humiliation for centuries, is the ultimate goal of my life...
I consider the principles of the Bharat Chaitanya Yuva Party as my very breath and will abide by the party's rules and regulations...
I will fulfill this sacred responsibility entrusted to me with complete honesty and selfless service, without giving any room for discrimination based on caste, religion, wealth, gender, or region, and without seeking any personal gain...
I will wage an uncompromising fight against corrupt politics that plunder public funds and against anti-people policies...
I will confront any evil force that attempts to disrupt the unity and honor of the party, and I will protect the party's secrets more than my own life...
I will dedicate all my strength to achieving the ideals of great personalities like Mahatma Jyotiba Phule, Savitribai Phule, and Dr. B.R. Ambedkar...
I solemnly swear this oath with unwavering faith in the Constitution of India and with a clear conscience.